Kandukur, Sri Potti Sriramulu Nellore | Sep 9, 2025
కందుకూరులో మంగళవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో రైతాంగ సమస్యల పరిష్కారం కోరుతూ వైసీపీ ఆధ్వర్యంలో చేపట్టిన రైతు పోరు కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. అంబేడ్కర్ విగ్రహం నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించాలన్న ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. భారీగా పోలీసులు విగ్రహం వద్ద మోహరించారు. అలాగే అక్కడ ఏర్పాటు చేసిన టెంట్ను కూడా పోలీసులు తొలగించారు.