సిబ్బంది సహకారంతో ఏజెన్సీ గిరిజన ప్రాంతంలో ప్రభుత్వ లక్ష్యం మేరకు ఉపాధిహామీ శ్రామికుల సంక్షేమమే మొదటి ప్రాధాన్యంగా విధులు నిర్వహిస్తానని రంపచోడవరం డివిజన్ డ్వామా అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్ అన్నారు. గురువారం పాడేరులో కలెక్టర్ దినేష్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసి నూతన డ్వామా ఏపీడీగా తూతిక శ్రీనివాస విశ్వనాధ్ భాద్యతలు స్వీకరించారు. గత సంవత్సర కాలంగా మారేడుమిల్లి ఎంపీడీఓగా సేవలందిస్తూ మండలాన్ని రాష్ట్రస్థాయిలో ప్రగతి పథంలో నిలిపిన శ్రీనివాస విశ్వనాధ్ 2007 గ్రూప్-1లో ఎంపీడీఓగా ఉద్యోగానికి ఎంపికయ్యారు.