ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయాలని PDSU జిల్లా కార్యదర్శి కర్క గణేష్ డిమాండ్ చేశారు. సోమవారం గిరిరాజ్ కళాశాల నుంచి కలెక్టరేట్ వరకు విద్యార్థులచే ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఫీజు నెంబర్స్ మెంట్, స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయకపోవడంతో విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. అలాగే ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలో నూతన భవనాలు ఏర్పాటు చేయాలన్నారు.