కరీంనగర్ నగరంలోని వినాయక నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా ఏర్పాటుచేసిన ఫ్లెక్సీ మంగళవారం వివాదాస్పదంగా మారింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జ్ వెలిచాల రాజేందర్ రావు ఫోటోలతో అభిమానులు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. మానకొండూరు ఎమ్మెల్యే, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ ఫోటో ఆ ఫ్లెక్సీలో లేకపోవడంతో తిమ్మాపూర్ మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించి మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. అనంతరం కరీంనగర్ కు వచ్చి వెలిచాల రాజేందర్ రావు ను కలిశారు. ఆ ఫ్లెక్సీ తాను ఏర్పాటు చేసింది కానీ ఎవరైనా కావాలంటే వివాదం సద్దుమణిగింది.