గచ్చిబౌలిలోని ఓ అపార్ట్మెంట్లో జరిగిన బర్త్డే పార్టీలో డ్రగ్స్ సేవిస్తున్న ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో రాజమహేంద్రవరం డిప్యూటీ తహశీల్దార్ మణిదీప్ ఉన్నారు. వారి నుంచి 20 గ్రాముల కొకైన్, 4 గ్రాముల ఎండీఎంఏ, 20 డ్రగ్స్ టాబ్లెట్స్ను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టైన వారిలో ప్రధాన నిందితుడు విక్రమ్రెడ్డితో పాటు ఇద్దరు యువతులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.