శ్రీ సత్యసాయి జిల్లా అగ్నిమాపక అధికారి మాధవ నాయుడు హిందూపురం అగ్నిమాపక కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. ఇటీవల సాధారణ బదిలీల్లో భాగంగా బాపట్ల జిల్లా నుండి శ్రీ సత్యసాయి జిల్లా అగ్ని మాపక అధికారిగా ఆయన భాద్యతలు స్వీకారించారు. ఇందులో భాగంగా అగ్నిమాపక కార్యాలయాన్ని తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. అనంతరం అగ్నిమాపక యంత్రం, సిబ్బంది వివరాలు తదితర అంశాలను అగ్నిమాపక కేంద్రం అధికారి ప్రభాకర్ తో అడిగి తెలుసుకున్నారు. భాగంగా సిబ్బందికి అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తగు సూచనలు చేశారు.