చిత్తూరు : చిత్తూరు నియోజకవర్గానికి పేరున్న కంపెనీలు వస్తాయని.. యువతకు స్థానికంగానే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ చెప్పారు. మంగళవారం పీవీకేఎన్ కళాశాలలో నిర్వహించిన జాబ్ మేళా కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గడిచిన ఏడాది కాలంలో ఇది మూడో జాబ్ మేళా నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రస్తుత జాబ్ మేళాలో టాప్ టెన్ కంపెనీస్ పాల్గొంటుంన్నందున యువత ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కంపెనీలు స్థాపనకు సంబంధించి భూ కేటాయింపుల్లో సమస్యలను కలెక్టర్ దృష్టి తీసుకెళ్లి పరిష్కరించామని.. త్వరలో