శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం పట్టణంలో వినాయకుల శోభాయాత్ర వినాయక నిమర్జనం రెండవ రోజు శుక్రవారం కొనసాగుతోంది. భారీ పోలీసు బందోబస్తు మధ్య ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 1300 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ ఐదు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఐదు నిమిషాల సమయానికి 25 విగ్రహాలు నిమర్జనం కావాల్సి ఉంది. శనివారం ఉదయం 10 గంటలకు గుడ్డం రంగనాథ స్వామి కోనేరు వద్ద వినాయకులు నిమజ్జనం పూర్తవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.