బిజెపి మైనార్టీ మోర్చా కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఎంపీ కార్యాలయంలో తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, జర్నలిస్ట్ షోయబుల్లా ఖాన్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి శుక్రవారం బిజెపి మైనార్టీ నాయకులు పూలమాలవేసి నివాళులు అర్పించారు.కలమే ఖడ్గంగా మార్చి నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన గొప్ప వ్యక్తి షోయబుల్లాఖాన్ అని బిజెపి మైనార్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి.ముజీబ్ అన్నారు. మత దురంకారానికి వ్యతిరేకంగా పోరాడిన గొప్ప మహనీయుడని కొనియాడారు.