ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైకాపా కార్యకర్తల రక్షణ కోసం ఇటీవలే డిజిటల్ బుక్ ప్రారంభించారు. కూటమి నాయకుల నుండి ఎదురవుతున్న ఇబ్బందులు కష్టాలను ఇందులో రూపొందించాలని తెలియజేశారు కానీ మడకశిరకు చెందిన మాజీ వైకాపా ఎమ్మెల్యే తిప్పేస్వామి పై అగలి మండలానికి చెందిన ఓ వ్యక్తి తన చెల్లెలకు అంగన్వాడి ఆయా ఉద్యోగం ఇప్పిస్తానని గతంలో తిప్పే స్వామి 75000 తీసుకొని మోసం చేశాడని డిజిటల్ బుక్ లో ఫిర్యాదు చేశాడు. మరో కౌన్సిలర్ మడకశిరకు చైర్మన్ చేస్తానని 25 లక్షల తీసుకొని మోసం చేశాడని డిజిటల్ బుక్ లో ఫిర్యాదు చేశారు.