బాపట్ల జిల్లా నూతన కలెక్టర్ గా డాక్టర్ వినోద్ కుమార్ నియమితులయ్యారు. ఆయన మొదట ఎంబిబిఎస్ పూర్తి చేసి వైద్యుడయ్యారు. 2004-05 ఐఏఎస్ బ్యాచ్ కు ఎంపికైన డాక్టర్ వినోద్ కుమార్, అనంతపురం ఉమ్మడి జిల్లాలో ట్రైనింగ్ కలెక్టర్ గా తన వృత్తిని ప్రారంభించారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండిగా, రంపచోడవరం సబ్ కలెక్టర్ గా, నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ గా, పార్వతీపురం ట్రైబల్ వెల్ఫేర్ లో, గ్రామీణ తాగునీరు, మైండ్స్ ల్యాండ్ శాఖల్లోనూ సేవలందించారు. 2024 ఏప్రిల్ 3న అనంతపురం జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు.