శనివారం అమావాస్య పురస్కరించుకొని నిజామాబాద్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం జానకంపేట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజాము నుండే పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి తరలివచ్చారు. అష్టముఖి కోనేరులో స్నానాలు ఆచరించి స్వామి వారిని దర్శించుకుంటే ఏళ్లనాటి శనిదోషం, గ్రహ పీడలు తొలగిపోయి అనుకున్న ఈ లభిస్తాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. జిల్లా నలుమూలల నుండే కాకుండా, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుండి భారీ ఎత్తున భక్తులు తరలి వచ్చారు. భక్తుల తాకిడిని దృష్టిలో ఉంచుకొని ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా ఆలయ కమిటీ ముందుగానే అన్ని ఏర్పాట్లు చేశారు.