కోదాడ కిట్స్ కాలేజ్ ఛైర్మన్ నీలా సత్యనారాయణపై శుక్రవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. బాధితుల వివరాలు.. కారులో హైదరాబాద్ నుంచి కోదాడకు కుటుంబ సభ్యులతో వెళ్తుండగా ఘటన జరిగింది. చివ్వెంల (మం) గుంపుల తిరుమలగిరి సమీపంలో మాటు వేసిన దుండగులు పేపర్ స్ప్ర్పే చల్లి, జాకీతో దాడి చేయగా కారు అద్దాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. కుటుంబ సభ్యులు చివ్వెంల పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.