మత్తు పదార్ధాల గుర్తింపులో శిక్షణ పొందిన స్లీఫర్ డాగ్స్ పనితీరు అద్భుతంగా ఉందని హోంమంత్రి అనిత అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ని మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని హోంమంత్రి వంగలపూడి అనిత ఉద్ఘాటించారు. ప్రజల రక్షణలో కీలకంగా వ్యవహరించే పోలీసు శాఖ మరింత చురుకుగా పని చేస్తోందని తెలిపారు. యువత మత్తుపదార్థాలకు బానిసగా మారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని చెప్పుకొచ్చారు. ఇవాళ గుంటూరు జిల్లాలోని ఆరో బెటాలియన్ ప్రాంగణంలో 22వ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్ జరిగింది. ఈ కార్యక్రమంలో హోం మంత్రి వంగలపూడి అనిత, డీజీపీ పాల్గున్నార