చెన్నూరు పట్టణంలోని ఎస్బీఐ బ్యాంకు ఎదుట సోమవారం మధ్యాహ్నం ఖాతాదారులు మరోసారి ధర్నాకు దిగారు. బ్యాంక్ ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు. ఖాతాదారులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తమ బంగారం ఏమైందో చెప్పాలని, లోన్లు మాఫీ చేసి తమకు నష్టపరిహారం చెల్లించాలని కోరారు. ఆందోళన జరుగుతున్న విషయం తెలుసుకొని పోలీసులు చేరుకొని వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. న్యాయం చేస్తామని బ్యాంక్ అధికారులు ఇచ్చిన హామీతో ధర్నా విరమించారు.