కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డి చెరువులో పడి ఓ మహిళ మృతి చెందినట్లు ఎస్సై రంజిత్ తెలిపారు. కుటుంబ కలహాలతో పాటు ఆర్థిక ఇబ్బందులు భరించలేక మహిళ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన చిన్న మల్లారెడ్డి శివారులో చోటుచేసుకుంది. ఎస్సై రంజిత్ తెలిపిన వివరాల ప్రకారం.. కొటాల్ పల్లికి చెందిన రాజమణి (49) సంవత్సరాలు, ఇంట్లో భర్తతో గొడవపడి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ మేరకు శవాన్ని పంచనామా నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని విచారణ చేపడుతున్నట్లు తెలిపారు.