**మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అరెస్ట్** రాయపర్తి మండల కేంద్రంలోని వరంగల్- ఖమ్మం జాతీయ రహదారిపై రైతుల సమస్యలను తీర్చాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రాస్తారోకో నిర్వహించారు. సకాలంలో రైతులకు యూరియా అందించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదాతలను ఇబ్బంది పెడుతోందని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి వెంటనే రైతులకు యూరియాను సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ధర్నాతో భారీగా వాహనాలు నిలిచిపోగా పోలీసులు ఎర్రబెల్లిని అరెస్టు చేశారు.