అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో అర్హులై ఉండి తొలగించిన వారి పింఛన్లు వెంటనే పునరుద్ధరించాలని సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ గుంతకల్లు డివిజన్ కార్యదర్శి సురేష్ డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట సోమవారం సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ నాయకులు ఆందోళన చేశారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్లను అందజేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులకు సదరం సర్టిఫికెట్లలో రీవెరిఫికేషన్ లో 40 శాతం కంటే తక్కువ అంగవైకల్యం ఉందని అలాంటి వారి పెన్షన్లను రద్దు చేస్తూ వందలాది మందికి నోటీసులు ఇచ్చి పింఛన్ మీదే ఆధారపడి జీవించే అనేకమంది పేదల కడుపు కొట్టిందన్నారు