బెజ్జిపురం మండల ఏర్పాటుకు ప్రభుత్వం సహకరించాలని మండల సాధన సమితి సభ్యులు ప్రసాదరావు అన్నారు. ఆదివారం లావేరులోని అదపాక జంక్షన్ వద్ద ఉన్న మార్కెట్ యాడ్లో సమావేశం నిర్వహించారు. సుమారు 12 పంచాయతీల సర్పంచులు, ఎంపీటీసీలతో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. మండల ఏర్పాటుకు అన్ని రకాలుగా వనరుల ఉన్నాయని, మండల సాధనకు అన్ని విధాల కృషి చేస్తామన్నారు. ప్రభుత్వం దృష్టి సారించాలని చెప్పారు.