Araku Valley, Alluri Sitharama Raju | Aug 23, 2025
అనంతగిరి మండలంలో శనివారం సాయంత్రం రహదారి ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు ఈ ఘటనకు సంబంధించి స్థానికులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి.ఎస్.కోటకు చెందిన బొలెరో అరకులోయ నుంచి సిమెంటు బస్తాలు, ఇనుప సామాగ్రిలోడు వేసుకొని బొద్ధంకు తీసుకెళ్తుండగా మండలంలోని డముకు ఘాట్ రోడ్డుపై సమీపంలోని మలుపు వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఘటన స్థలానికి అనంతగిరి ఎస్ఐ శ్రీనివాస్ చేరుకొని పరిశీలించారు.