గుంటూరు రూరల్ మండలం తురకపాలెంలో గ్రామంలో కేవలం వ్యక్తులు, వ్యవస్థల లోపం వల్లనే 40 మందికి పైగా మరణించారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సి.హెచ్ బాబురావు ఆరోపించారు. తురకపాలెం గ్రామంలో మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ ను గ్రీవెన్స్ లో కలిసి వినతి పత్రం సమర్పించారు. అనంతరం మీడియాతో బాబురావు మాట్లాడుతూ జరగరాని భారీ ప్రాణ నష్టం జరిగిన తర్వాత హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి ఏంటి ప్రయోజనం ప్రశ్నించారు.