అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని తొండపాడు గ్రామంలో వెలసిన శ్రీ బొలికొండ రంగనాథ స్వామి ఆలయంలో గురువారం మాణిక్య రంగనాథ స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని గ్రామంలో నిర్వహించిన కల్యాణోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఆలయ అర్చకుడు మురళి వేకువజాము నుంచి స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శ్రీదేవి, భూదేవిలతో రంగనాథుడికి కళ్యాణం జరిపించారు.