ఈనెల 5వ తేదీన మాడగడ గిరిజన గ్రామంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారని కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. బుధవారం రాత్రి అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రమైన పాడేరులోని జిల్లా కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశం నిర్వహించారు. రచ్చబండ ఏర్పాట్లు చేయాలన్నారు. ఉప ముఖ్యమంత్రి ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. ఉప ముఖ్యమంత్రి ముందుగా రచ్చబండ దగ్గరకి వస్తారని, అక్కడి నుండి బలిపాడు చెరువు దగ్గరికి చేరుకుంటారన్నారు. పర్యటనకు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.