జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య గొప్పతనాన్ని భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కృష్ణాజిల్లా ఎస్పీ ఆర్ గంగాధరరావు అన్నారు. వెలుగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మచిలీపట్నంలోని చిలకలపూడి పోలీస్ స్టేషన్ వద్ద పింగళి వెంకయ్య జయంతిని నిర్వహించగా ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు నగర ప్రముఖులు పాల్గొన్నారు.