తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో అమర సాహసంతో పోరాడిన వీరవనిత చాకలి ఐలమ్మ మహిళా శక్తికి ప్రతీకగా నిలిచారని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు.బుధవారం జిల్లా వెనకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో, ఐడిఓసి కార్యాలయం సమావేశ మందిరంలో నిర్వహించిన చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని, ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.