బాపట్ల జిల్లా కొల్లూరు కెటి కాలనీ వద్ద కాలువలో 13 ఏళ్ల బాలుడి మృతదేహం లభ్యమైంది. కొల్లూరుకు చెందిన తుమ్మ చింతయ్య కుమారుడు శివ సుబ్రహ్మణ్యం ఈ నెల 6వ తేదీ నుండి కనిపించకుండా పోయినట్లు కొల్లూరు ఎస్ఐ అమర వర్ధన్ తెలిపారు. శనివారం అతని మృతదేహం కాలువలో కనిపించగా, స్థానికులు సమాచారం అందించారు. ఈ ఘటనపై కొల్లూరు పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తెనాలి వైద్యశాలకు తరలించారు.