వనస్థలిపురం సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అవినీతి ఆరోపణలపై పలు ఫిర్యాదులు అందగా.. ఏసీబీ DSP ఆనంద్ కుమార్ నేతృత్వంలో సోదాలు చేస్తున్నారు. సబ్ రిజిస్టర్ రాజేశ్ కుమార్ రూ. 70 వేల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. ACB అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు.