సైబర్ నేరాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని మహబూబ్నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎంబీఏ డిగ్రీ కళాశాల ఎస్సీ బాలికల వసతి గృహంలో "యువత భవిష్యత్తు పోలీసుల చైతన్యంతో సురక్షితం"అన్న అంశంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. డీఎస్పీ మాట్లాడుతూ.. మత్తు పదార్థాలు, గంజాయి యువతను నాశనం చేస్తున్నాయని, యువత వాటికి దూరంగా ఉండాలన్నారు.