సంతనూతలపాడు లో అన్నదాత పోరు కార్యక్రమంలో భాగంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్చార్జి మరియు మాజీ మంత్రి మేరుగ నాగార్జున వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి భారీ బైక్ ర్యాలీ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. సంతనూతలపాడు లోని ప్రధాన రహదారుల్లో బైక్ ర్యాలీ కార్యక్రమం కొనసాగింది. అనంతరం ర్యాలీగా ఒంగోలు ఆర్డిఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించేందుకు కార్యకర్తలు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి నాగార్జున మాట్లాడుతూ.... రైతులకు యూరియా కూడా సరఫరా చేయలేని స్థితిలో కూటమి ప్రభుత్వం ఉందని విమర్శించారు.