ముదిగుబ్బ మండలంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలను ఎంపీపీ గొడ్డుమరి ఆదినారాయణ యాదవ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో పలు షాకింగ్ విషయాలు ఆయన కంటపడ్డాయి. ముఖ్యంగా విద్యార్థుల ముందే వంట సిబ్బంది కొట్లాడడం, నాణ్యతలేని వంటలు చేయడం సిబ్బంది క్రమశిక్షణ రాహిత్యం వంటి వాటిని గుర్తించి అందరి ముందు సిబ్బందికి తీవ్రంగా హెచ్చరికలు జారీ చేశారు. విద్యార్థులకు ప్రభుత్వం ఇస్తున్న వాటిని సక్రమంగా ఎందుకు ఉపయోగించడం లేదంటూ తీవ్రంగా హెచ్చరించాడు.