పటాన్‌చెరు మండలం రుద్రారం గణేష్ గడ్డలో బ్రహ్మోత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల 10వ, రోజున స్వామివారిని విశేష పుష్పాలంకరణలతో అలంకరించి భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారి దర్శనం పొందారు. ప్రత్యేక పూజలు, మంగళహారతులు నిర్వహించగా, ఆలయ ప్రాంగణం "గణనాథ శరణం" నినాదాలతో మారుమోగింది.