కనిగిరి పట్టణంలో ఈ నెల 9వ తేదీన నిర్వహించే అన్నదాత పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కనిగిరి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ పిలుపునిచ్చారు. కనిగిరిలోని వైసీపీ కార్యాలయంలో ఆదివారం అన్నదాత పోరు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను నారాయణ యాదవ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రైతులు తీవ్రమైన ఎరువుల కొరతతో ఇబ్బందులు పడుతుంటే , ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదని విమర్శించారు. రైతుల సమస్యలు పరిష్కారం అయ్యేవరకు వైసీపీ పోరాటం చేస్తుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్, నాయకులు పాల్గొన్నారు.