ఓటీపీ పేరుతో రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని నంగునూరు పీఏసీఎస్ చైర్మన్ కోల రమేష్ గౌడ్ అన్నారు. బుధవారం నంగునూరు మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రైతులు తమ పంటలకు అవసరమైన యూరియాను సకాలంలో అందించలేకపోతే పంట దిగుబడి తగ్గి భారీ నష్టాలు చవిచూసే ప్రమాదం ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టించిన యూరియా కొరతను వెంటనే తీర్చాలని లేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ హాయాంలో నిరసనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.