కనిగిరి: రైతులకు కనీసం ఎరువులు కూడా సరఫరా చేయలేని దుస్థితిలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉందని రాష్ట్ర వైసీపీ రైతు విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ గా నూతనంగా నియమితులైన కనిగిరి పట్టణానికి చెందిన మాజీ పీడీసీసీ బ్యాంకు చైర్మన్ వైఎం ప్రసాద్ రెడ్డి విమర్శించారు. రాష్ట్ర రైతు విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులైన ప్రసాద్ రెడ్డి ని కనిగిరి నియోజకవర్గంలోని 6 మండలాలకు చెందిన వైసిపి నాయకులు, కార్యకర్తలు ఆదివారం కలిసి ఆయనను అభినందించారు. ఈ సందర్భంగా ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ రైతుల సమస్యలు పరిష్కారం కోసం వైసిపి తరఫున శక్తి వంచన లేకుండా పోరాటం చేస్తామన్నారు.