నల్లగొండ జిల్లా కేంద్ర పరిధిలోని స్థానిక సంస్థలను పరిష్కరించాలని బిటి రోడ్డు నిర్మాణ పనులను చేపట్టాలని బిజెపి మండల అధ్యక్షుడు అనిల్ కుమార్ ఆధ్వర్యంలో సోమవారం తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన చేపట్టి అనంతరం వినతి పత్రాన్ని తహసిల్దార్ కు అందజేశారు. ముషంపల్లి నర్సింగ్ బట్ల గ్రామాల నుంచి నల్లగొండకు రోడ్డు నిర్మాణం వెంటనే పూర్తి చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. రోడ్లన్నీ గుంతలమయం అయ్యాయని రోడ్లన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయని వెంటనే బీటీ రోడ్డు నిర్మాణ పనులను పూర్తిచేయాలన్నారు.బిజెపి కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు గోలి మధుసూదన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.