గణేష్ నిమజ్జనాల ఊరేగింపులకు అధికారులు ఆటంకాలు పెట్టవద్దు అని రాష్ట్ర టిడిపి పార్టీ కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో గాని రాష్ట్రంలోని గాని గణేష్ నవరాత్రుల ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి అని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూ సంప్రదాయాలు సంబంధించినటువంటి పూజ కార్యక్రమాలు అలాగే ఉత్సవాలు ఇతర కార్యక్రమాలు ఎంతో ఘనంగా వైభవంగా ప్రజలు జరుపుకుంటున్నారని అన్నారు. ఇటీవల కాలంలో గణేష్ మండపాలకు కూటమి ప్రభుత్వం ఉచిత విద్యుత్ ఇవ్వడం వాళ్ళకి కావలసిన పర్మిషన్లు ఇవ్వడం జరిగింది అని పేర్కొన్నారు. దీంతో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని అన్నారు.