అనకాపల్లి జిల్లా మాడుగుల మండలంలో విద్యుత్ షాక్ తో ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. స్థానిక ఎస్సై నారాయణరావు తెలిపిన వివరాల ప్రకారం, మాడుగుల మండలం చిన కూర్మనాదపురానికి చెందిన అల్లంగి సత్యనారాయణ (37) అనే వ్యక్తి అల్లంగి కృష్ణబాబు కమ్మల పాక ఇంట్లో కరెంట్ వైర్ ను పట్టుకోవడం వల్ల ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురయ్యాడు. వెంటనే మాడుగుల ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు భార్య మౌనిక ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై పేర్కొన్నారు.