జగిత్యాల జిల్లా,కొడిమ్యాల మండల కేంద్రంలోని,ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి ఆదేశాల మేరకు సోమవారం మధ్యాహ్నం నాలుగు గంటలకు హార్ట్ ఫుల్ నేస్ స్వచ్ఛంద సంస్థ జిల్లా కన్వీనర్ మంచాల కృష్ణ ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ విద్యార్థుల కు ధ్యాన శిక్షణ తరగతులను ప్రారంభించారు, ఈ సంద ర్భంగా కృష్ణ మాట్లాడుతూ,ఈ శిక్షణ తరగతులు మూడు రోజుల పాటు జరుగుతాయని ప్రతి విద్యార్థి ధ్యానం పై అవగాహన కలిగి ఉండాలని,నిత్యం ధ్యానం చేయడం వల్ల అనేక శారీరక,మానసిక సమస్యలను దూరం చేసుకోవచ్చని చదువుపై ఏకాగ్రత సాధించవచ్చునని తెలిపారు,