35 వేల రూపాయల విలువగల గుట్కా పట్టివేత- హనుమకొండ ఇన్స్పెక్టర్ మచ్చ శివకుమార్ ఈరోజు హనుమకొండ సబ్ ఇన్స్పెక్టర్ సతీష్ మరియు క్రైమ్ టీం రావుఫ్ అశోక్ లు కాకాజీ కాలనీలో పెట్రోలింగ్ చేయుచుండగా ఇద్దరు వ్యక్తులు ఫోజె రామ్ మరియు దశరథులు స్కూటీ మీద కాకాజీ కాలనీ ఏరియాలో మూడు బ్యాగులలో నిషేధిత పొగాకు ఉత్పత్తులను వేసుకొని రవాణా చేస్తుండగా పట్టుకొని వారి దగ్గర ఉన్న సుమారు 35 వేల రూపాయల నిషేధిత పొగాకు ఉత్పత్తులను మరియు యాక్టివా మోటార్ సైకిల్ ని సీజ్ చేసి వారిపై కేసు నమోదు చేయడం జరిగినది అని ఇన్స్పెక్టర్ తెలిపారు