ఎంతో మంది నిరుద్యోగులను మోసం చేసిన ఘనత చక్రధర్ గౌడ్ ది అని సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ ఆరోపించారు. సిద్దిపేట పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అత్తు ఇమామ్ మాట్లాడుతూ.. చక్రధర్ గౌడ్ కు కాంగ్రెస్ పార్టీ కి ఎలాంటి లాభం లేదని, నేరాలను కప్పి పుచ్చుకోవడానికే కాంగ్రెస్ పార్టీలో చేరారన్నారు. నువ్వు ఏ పార్టీలోకి వెళ్లినా ఆ పార్టీ లో ఉన్న నాయకులకు కుంపటి పెట్టావన్నారు. కేసులు కొట్టి వేయాలని మైనంపల్లి హనుమంతరావు కాళ్లు మొక్కిన వ్యక్తి చక్రధర్ గౌడ్ అన్నారు. హనుమంతరావు గురించి మాట్లాడితే స్థాయ