కావలి నియోజకవర్గం దగదర్తి చెరువులో కలప దొంగలు పడ్డారు.ఇటీవల చెరువులో ఉన్న నల్లతుమ్మ చెట్లను అక్రమంగా నరికి తరలిస్తున్నారు.చెరువులో నుంచి ట్రాక్టర్లు బయటకి వచ్చేందుకు కట్టెలు ద్వంసం చేస్తున్నారు.వర్షాకాలంలో చెరువు నిండితే పక్కనే ఉన్న హరిజనవాడకు వరద నీటి గండం ఉందని వారు వాపోతున్నారు.యదేచ్చగా ఇంత జరుగుతున్నా ఇరిగేషన్ రెవెన్యు అధికారులు స్పందించడంలేదని శనివారం ఉదయం 11 గంటల 30 నిమిషాల ప్రాంతంలో దగదర్తి చెరువు నీటి సంఘం అధ్యక్షుడు మాలేపాటి సుధాకర్ నాయుడు తెలిపారు.ఇప్పటికయినా అక్రమంగా కలప తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.