ప్రశాంతంగా, శాంతియుతంగా, సామరస్య వాతావరణంలో గణేష్ ఉత్సవాలు జరుపుకుందామని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు.వినాయక చవితి పండుగ ప్రారంభం నుండి నిమజ్జనం వరకు, ప్రజలు పోలీస్ శాఖకు పూర్తి సహకారం అందించాలని సూచించారు. జిల్లాలోని వినాయక ఉత్సవాలకు ganeshutsav.net వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో సింగిల్ విండో విధానంలో మాత్రమే అనుమతులు పొందాలి. అనుమతి పత్రంలో పేర్కొన్న నిబంధనలను తప్పక పాటించాలి. ప్రైవేట్ స్థలంలో మంటపం ఏర్పాటు చేస్తే **స్థల యజమాని రాతపూర్వక అనుమతి** తప్పనిసరి. మంటపం కోసం అనుమతి పత్రాల ప్రతులను మంటపంలో ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచాలన్నారు.