ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకాల సముద్ర తీరంలో శుక్రవారం సాయంత్రం 6 గంటల వరకు గణేష్ విగ్రహాల నిమజ్జన కార్యక్రమం జరిగింది. దాదాపు 100 వినాయకుడి విగ్రహాలు నిమజ్జనం అయినట్లుగా అధికారులు గుర్తించారు. తొమ్మిది రోజులపాటు పూజలు అందుకున్న గణేష్ విగ్రహాలను భక్తులు పాకాల సముద్ర తీరంలో నిమజ్జనం చేశారు. అధికారులు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.