అనకాపల్లి జిల్లా వీ.మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో గల దేవరపల్లి మండలం తార్వా గ్రామంలోని మాజీ ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు మీడియాతో మాట్లాడారు..కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నం చేస్తుందని, క్యాబినెట్లో ఈ మేరకు నిర్ణయం తీసుకోవడాన్ని వ్యతిరేకించారు. వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసారు.