వెంకటాపురంలో ఘనంగా శ్రీ గుంటి రంగస్వామి రథమహోత్సవం..ఎమ్మిగనూరు పట్టణ పరిధిలోని వెంకటాపురంలో శనివారం శ్రీ గుంటి రంగస్వామి రథ మహోత్సవం కన్నల పండువగా జరిగింది. రథ మహోత్సవంలో పట్టణం నుంచే కాక వివిధ గ్రామాల నుంచి ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి భక్తిశ్రద్ధలతో స్వామిని దర్శించుకుని, మొక్కులు తీర్చుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పట్టణ పోలీసులు పటిష్ఠ బందోబస్తు నిర్వహించారు.