అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలోని చిన్న ముస్టూరు గ్రామంలో గురువారం కీటక జనిత వ్యాధుల నియంత్రణ కార్యక్రమాన్ని గ్రామపంచాయతీ కార్యదర్శి రమణ స్వామి ఆధ్వర్యంలో వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందితో కలిసి నిర్వహించిన కార్యక్రమంలో ఉరవకొండ డివిజన్ మలేరియా సబ్ యూనిట్ అధికారి భక్తుల కోదండరామిరెడ్డి పాల్గొన్నారు. సచివాలయ అధికారులు వైద్య శాఖ సిబ్బందితో కలిసి ఇంటింటా వెళ్లి ఫీవర్ సర్వే నిర్వహించి జాతీయ కీటక జంట వ్యాధుల నియంత్రణ కరపత్రాలను పంపిణీ చేశారు. సీజన్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని అవగాహన కల్పించారు.