రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పరిధి కొత్తూరులోని కోడిచెర్ల తండావాసులు ఓటు వెయ్యమంటూ నిరాకరించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి పంచాయతీ అయినా కోడిచెర్ల నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న కొత్తగా ఏర్పడిన పంచాయితీ పంచాయతీ కొడిచర్లకు పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఊరంతా కలిసి రోడ్డుపై బేటాయించారు. రంగంలోకి దిగిన పోలీసులు మరియు ఎమ్మార్వో మరో ఎలక్షన్ నాటికి పోలింగ్ కేంద్రం నిర్వహిస్తామని వారికి హామీ ఇచ్చారు.