ప్రకాశం జిల్లా కొమరోలు మండలం దద్దవాడ గ్రామ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వాహనం ఢీకొని ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న కొండయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందగా, ద్విచక్ర వాహనం రోడ్డుపై ఉన్న విషయాన్ని గమనించక అదే ద్విచక్ర వాహనాన్ని ఢీకొని మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కేసు నమోదు చేసిన ఎస్ఐ నాగరాజు ప్రమాదం పై దర్యాప్తు చేస్తున్నారు. గాయపడ్డ ఇద్దరు ఒంగోలులో ఉండటం మరో వ్యక్తి మృతి చెందడం వల్ల ప్రమాదంపై సరైన వివరాలు తెలియలేదని పూర్తి వివరాలు విచారణ అనంతరం వెల్లడిస్తామన్నారు.