శ్రీ సత్య సాయి జిల్లా పరిధిలోని వయోజన విద్యా శాఖలో 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.కదిరి డివిజన్-1, పెనుకొండ డివిజన్-1 పర్య వేక్షకుల పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని అనంతపురం జిల్లా జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ పుట్టపర్తిలో సోమవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాల విద్యా శాఖలో పనిచేస్తున్న అర్హులైన ఎస్జీటీలు, పీఈటీలు, గ్రేడ్-2 భాషా పండితులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.