రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి కార్యకర్త కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మెల్యే సామేలు అన్నారు. బుధవారం తిరుమలగిరిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్య కర్తల సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందన్నారు. కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలన్నారు.